HomeMovie Newsస్పెషల్ సాంగ్ కి రెడీ అవుతోన్న 'విశ్వంభర' 

స్పెషల్ సాంగ్ కి రెడీ అవుతోన్న ‘విశ్వంభర’ 

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు.

మొదటి నుండి మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈమూవీ వాస్తవానికి ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ కాగా అందులో విజువల్ ఎఫెక్ట్స్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ పై టీమ్ గట్టిగా దృష్టిపెట్టింది. అందువలన మూవీ కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది.

అయితే విషయం ఏమిటంటే ప్రస్తుతం విశ్వంభర కు సంబంధించి ఒక స్పెషల్ డ్యాన్స్ నంబర్ ని చిత్రీకరించేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈ సాంగ్ మూవీలో అదిరిపోతుందని, అలానే దీనిని భీమ్స్ సిసిలోరియో కంపోజ్ చేస్తున్నారు. మొత్తంగా అందరిని ఆకట్టుకునేలా దర్శకుడు వశిష్ట దీనిని తెరకెక్కిస్తున్నారని, త్వరలో మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేందుకు టీమ్ సన్నాలు చేస్తుందని తెలుస్తోంది. 

See also  'కుబేర' సెన్సార్ పూర్తి & రన్ టైం లాక్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories